ముమైత్ ఖాన్ ఇంటర్వ్యూ చేస్తున్న నా చేయివిరగొట్టింది : శ్రీరాపాక..

బిగ్ బాస్.. సుమారు 3 నెలల పాటు వినోదాన్ని పంచే రియాలిటీ షో. వినోదం మాత్రమే కాదు.. వివాదాలకు కూడా కేరాఫ్ గా చెప్పుకోవచ్చు. కేవలం గంట పాటు చూపించే ఎపిసోడ్ లో ఆట పాటలు, కొట్లాటలు, సరదాలు, ఏడుపులు కామన్. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది? ప్రేక్షకులకు 24 గంటలు చూపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియాతో వచ్చిందే బిగ్ బాస్ ఓటీటీ. తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ముందుకు వచ్చింది. ఈ సారి టీవీలో కాకుండా కేవలం హాట్ స్టార్ లో మాత్రమే చూసే అవకాశం కల్పించారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా కేవలం గంట ఎపిసోడ్ లా కాకుండా 124 గంటలు ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. వాస్తవానికి హౌస్ లో మొదటి నామినేషన్స్ కూడా జరిగాయి.

ఈ నామినేషన్స్ తర్వాత కంటెస్టెంట్ల మధ్య మనస్పర్దలు కూడా పెరిగాయి. ముమైత్ ఖాన్ మూలంగా హీరోయిన్ శ్రీ రాపాక బాగా హర్ట్ అయ్యింది. ఆమెతోటి కాంటెస్టెంట్లతో మూడేళ్ల కిందట..ఓ ఇంటర్వ్యలో ముమైత్ ఖాన్ తన చేయి విరగ్గొట్టింది. అప్పుడు నా చేయి వాచిపోయింది. దీనికి ఆర్జే చైతూనే సాక్ష్యం అన్నది. ఆ సమయంలో చైతూ, కాజల్ అక్కడే ఉన్నట్లు చెప్పింది. చెయ్యి విరిగినట్లు రిపోర్టులు చూసి వాళ్లు తన వైపు నిలబడినట్లు చెప్పారు. దాన్ని మనసులో పెట్టుకుని ముమైత్ ఇప్పుడు తనతో ఇలా మాట్లాడుతుందని చెప్పింది.

ప్రస్తుతం తానే ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించినా.. సరిగా మాట్లాడ్డం లేదని చెప్పింది. పైగా నన్ను లయర్ అన్నట్లు బాధపడింది. నా శరీరానికి కాదు.. ప్రస్తుతం మనసుకు గాయం చేస్తుందని మండిపడింది. వాస్తవానికి చీటింగ్, లయర్ అనేది తనకు నచ్చని పదాలని వెల్లడించింది. తన బాధ ను బయటకు చెప్పుకుని ఏడ్చింది. దీంతో ఆమెను పలువురు కంటెస్టెంట్లు ఓదార్చారు. మున్ముందు ఇంకా వీరి మధ్య పెద్ద రచ్చ జరిగే అవకాశం ఉంటుంది. అయితే వీరి మధ్య ఇంక ఏమేం వివాదాలు జరుగుతాయి? అనేది త్వరలో తెలియనుంది.