సమంత అదిరిపోయే వీడియో..ఆ హీరోకి దిమ్మ తిరిగిపోయిందిగా..!!

హీరోయిన్ సమంత..సినీ ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది. ఏమాయ చేశావే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ హాట్ బ్యూటీ..ఆ సినిమాతోనే కుర్రాళ్ల మనసును మాయ చేసి..తన క్యూట్ స్మైల్ తో పడేసింది. ఒక్క సినిమాతోనే తన తల రాతను మార్చేసుకుంది సమంత. ఆ తరువాత హిట్ ఫ్లాప్ సినిమా లు అంటూ తేడా లేకుండా..వరుస పెట్టి సినిమాలకు కమిట్ అవుతూనే వస్తుంది. ప్రజెంట్ అమ్మడు చేతిలో దాదాపు అర డజనుకి పైగా బడా సినిమా లు ఉన్నాయి. తన వ్యక్తిగతంగా వచ్చిన ఇబ్బందులకు అధిగమిస్తూ కెరీర్ లో దూసుకుపోతోంది సమంత. ఎవ్వరేమనుకున్నా తన దారి తనదే అన్నట్లుగా వృత్తిపరమైన లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

సమంత ఫిట్‌నెస్ విషయం లో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనకు తెలిసిందే. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా డైలీ ఖచ్చితంగా వర్క్ అవుట్స్ చేస్తూ శరీరాని ఫిట్ గా ఉంచుతుంది. ఇక తన వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో సమంత మరీ ఎక్కువుగా వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే రీసెంట్ గా సామ్ కు ఓ బాలీవుడ్ బడా హీరో టైగర్ ష్రాఫ్ ఆత్తచ్క్ ఛల్లెంగె విసిరాడు. దీంతో నెటిజన్స్ కాసేపు నవుకున్నారు. ఎవ్వరికి పోయి నువ్వు ఏం ఛాలెంజ్ విసిరావు అంటూ సమంత కు ఇలాంటి ఛాలెంజ్ లు ఓ లెక్క అంటూ సామ్ ని ఆకాశానికి పొగిడేశారు. ఇక సమంత కూడా టైగర్ ష్రాఫ్ కు మైండ్ బ్లాకింగ్ రిప్లై ఇచ్చింది.

వర్కౌట్స్ లో అసలు ఎటాక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసిన జనాలు సమంత ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. కిల్లర్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి టైగర్ ష్రాఫ్ కు మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చింది సమంత. అంతేకాదు Attack Challengeకు అర్జున్ కపూర్‌ని నామినేట్ చేసింది. తన ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ..బ్లాక్ కలర్ జిమ్ డ్రెస్ వేసుకున్న సామ్ “నన్ను సవాలు చేసినందుకు టైగర్ ష్రాఫ్ కు ధన్యవాదాలు! ఇప్పుడి నేను ఈ ఎటాక్‌ ఛాలెంజ్‌ కి అర్జున్ కపూర్ ని నామినేట్ చేస్తున్నాను!!” అంటూ పోస్ట్ ను షేర్ చేసింది. మరి అర్జున్ కపూర్ సాం ఛాలెంజ్ ని స్వీకరిస్తాడా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది..?