శంకర్ కొంప ముంచిన లీకు రాయళ్లు..క్రేజీ పిక్స్ లీక్..ఫోటోలు వైరల్ !!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చక ఎంత మంచి జరుగుతుందో తెలియదు కానీ చెడు మాత్రం ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఓ మంచి వార్త, లేదా ఉపయోగ పడే వార్త జనాలకు లేట్ గా రీచ్ అయినా..ఓ తప్పుడు పని మాత్రం జెట్ స్పీడ్ లో నెట్టింట ట్రేండింగ్ లోకి వెళ్లిపోతుంది. ఇది మారుతున్న టెక్నాలజీ అనాలో లేక కలియుగంలో పోయే కాలం అనాలో అర్ధం కావడం లేదు అంటున్నారు జనాభా. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకి ఈ సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది. దీని వల్ల ఎన్ని మంచి జరుగుతున్నా..కానీ ఒక్క చెడ్డ పని వల్ల కోట్లల్లో నష్టం వస్తుందట.

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో లీకుల బెడద ఎక్కువైపోయింది. చిన్న బడ్జేట్ సినిమా ల మాట అటుంచితే..పెద్ద సినిమాలు భారీ బడ్జేట్ మూవీల నిర్మాతలు మేకర్స్..ఎంత జాగ్రత్త పడుతున్నా ఎవడో ఒకడు సినిమాకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను, ఫైట్ సీన్లను,లేదా పాటలను సినిమా రిలీజ్ కంటే ముందే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ మధ్య పుష్ప సినిమా విషయంలో అదే జరిగింది. ఫుల్ ఫైట్ సీన్ లీకైంది. నిన్న కాక మొన్న వచ్చిన సర్కారు వారి పాట సినిమా నుండి కళావతి సాంగ్ లోను అదే జరిగింది. తమన్ అయితే ఏడ్చినంత పనైంది. బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక ఇప్పుడు చరణ్ సినిమా కు ఈ లీకులు బెడద తప్పడం లేదు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో చరణ్ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియార నటిస్తుంది. సునీల్ , అంజలి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మధ్యనే రాజమండ్రీలో కొంచెం షూటింగ్ పూర్తి చేసుకున్నారు టీం . అయితే ఈ క్రమంలోనే నెట్టింట కొన్ని చరణ్ పిక్స్ లీకైయ్యాయి. దీంతో చిత్ర బృందం వార్నింగ్ ఇచ్చింది. షూటింగ్ చూడటానికి వచ్చిన వాళ్లు ఫోటోలు తీసి నెట్టింట పోస్ట్ చేస్తే కఠినమైన యాక్షన్ తీసుకుంటాం అని ప్రెస్ నోట్ రిలీజ్ చెసారు. కానీ ఎవ్వరికి బయపడని లీకు రాయళ్లు..మళ్లీ చరణ్ కి సంబంధించి కొన్ని పిక్స్ ని లీక్ చేశారు. ఇక ఈ పిక్స్ లో అచ్చం చిరంజీవి లానే కనిపిస్తున్నారంటూ పొగిడేస్తున్నారు అభిమానులు. మరికొందరైతే చిరంజీవినే మించిపోయావు బాస్ నువ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా పిక్స్ వైరల్ గా మారాయి. ఇప్పుడు చిత్ర బృందం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి మరి..?