#NBK107 : బాలయ్య బిగ్ సర్ప్రైజ్.. నందమూరి అభిమానులారా గెట్ రెడీ..!!

నందమూరి నట సింహం బాలయ్య..వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాదు…ఆ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు. రీసెంట్ గా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అద్దిరిపోయే రేంజ్ లో “అఖండ” తో బ్లాక్ బస్టర్ విజయాని విజయాని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా అఘోర గా కనిపించి నటించి అభిమానులను మెప్పించాడు. ఈ సినిమా తో బాలకృష్ణ ఎలాంటి విజయాని అందుకున్నాడొ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

కాగా, ఇప్పుడు ప్రజెంట్ ఈయన గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ క్రేజీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమా కోసం అమ్మడు తన బాడీలో చాలా మార్పులు చేసుకుంటుంది. సినిమా కోసం బరువు పెరగమని డైరెక్టర్ సజీస్ట్ చేయడంతో ..తన బరువును పెంచుకునే పనిలో పడ్డిందట ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఓ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

అదేంటంటే..తెలుగు వారి పండగ ఉగాదిని సందర్భాన్ని పురస్కరించుకుని NBK107 ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు బాలయ్య అభిమానులకు మరో సర్ప్రైజ్ కూడా రెడీ చేశారట. ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ ఒక ఆసక్తికరమైన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారట చిత్ర బృందం. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం అన్ని వర్క్స్ ఫినిష్ చేసారట. సో..ఈ ఉగాదికి బాలయ్య నందమూరి ఫ్యాన్స్‌కి మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడనమాట.