RRR: వాటికోసం కోట్లు ఖర్చు చేసారట..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసిన ఎన్టీఆర్..!!

ఇప్పుడు ఎక్కడ చూసిన,ఎవ్వరి నోట విన్నా ఒక్కటే మాట అదే RRR..RRR..RRR. దేశవ్యాప్తంగా #RRR ట్రేండ్ నడుస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. మెగా వారసుడు చరణ్..నందమూరి వారసుడు తారక్..కలిసి నటించిన ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సినిమా సంబంధించిన హ్యాస్ ట్యాగ్స్ తో ట్వీట్టర్, ఇన్స్టా లో అభిమానులు ఓ రేంజ్ లో తమ అభిమాన హీరోను పోగిడేస్తున్నారు.

ఇక రాజమౌళి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా ను ఎంత బాగ తెరకెక్కిస్తాడో అంతే బాగా ప్రమోట్ కూడా చేస్తాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం అన్ని భాష ల ప్రజలతో ముచ్చటించారు RRR టీం. సినిమాను ప్రమోట్ చేసుకునే ఏ ఛాన్స్ ను మిస్ చేసుకోలేదు జక్కన్న. ఆ విషయంలో రాజమౌళి ని మించిన డైరెక్టర్ లేడు..రాడు..రాబోడు..అంటున్నారు ఫ్యాన్స్.

కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా RRR టీం ఓ ప్రముఖ పత్రికా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో సరదాగా మాట్లాడారు. రాజమౌళి, చరణ్,తారక్..ముగ్గురు పాల్గొన్న ఈ ఇంటర్వ్యుల్లో తారక్ మాట్లాడుతూ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశాడు. తారక్ మాట్లాడుతూ..” సినిమా కోసం రాజమౌళి చాలా కష్టపడ్డారు. మమ్మల్ని కష్టపెట్టాడు. నాటు నాటు స్టెప్ కోసం మమ్మల్ని టార్చర్ పెట్టాడు. సింక్ లో స్టెప్ వచ్చినా ఆయనకు నచ్చకపోతే ..మళ్ళీ ప్రాక్టీస్ చేయించేవాడు. ఈ సినిమా లో మేము 1920లో మాట్లాడే తెలంగాణ భాషను వాడాము.” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి మాట్లాడుతూ..” సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేద్దాం అనుకున్నా. కానీ, అది కాస్తా అటూ ఇటూ నాలుగేళ్ళు పట్టింది. ఈ సినిమాలోని ప్రతి సీన్ తో ఎమోషనల్ గా కనెక్ట్ ఆయ్యాను. ఈ సినిమాలో అసలు హీరో కధే. ఈ సినిమాలో హీరోలిద్దరి పారితోషికం కన్నా సెట్లకు వేసిన ఖర్చు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు.