తెలుగు రాష్ట్రాలు ,కర్ణాటకలో మైన్ కింగ్ గాలి జనార్ధనరెడ్డి అంటే తెలియనివారెవ్వరు ఉన్న్డరు .వై ఎస్ రాజశేఖర్ సీఎం గా ఉన్నప్పుడు గాలి హావ ఎలా ఉండేదో అందరకి తెలిసిందే .అయన జైలు కి వెళ్లడం ,బెయిలు రావడానికి జడ్జికి లంచం ఇవ్వడం తెలిసిందే.ఇదంతా గతం ఇప్పుడు అయన ప్రస్తావన ఎందుకంటే అయన వారసుడు సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు .
వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్ లో రాధా కృష్ణ దర్శకత్వంలో కిరీటి హీరోగా సినిమా తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాకి రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా ,కేక్ సేంతిలి కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు . ఏ సినిమాకి డైరెక్టరే మాటలు అందిస్తున్నాడు .ఈ సినిమాకి సంబందించి హీరో ,హీరోయిన్ ని పరిచయం చేస్తూ ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేసారు .