ఆయనని చెప్పుతో కొట్టాలి…బిగ్ బాస్ బ్యూటీ కాంట్రవర్షీయల్ కామెంట్స్..!!

బిగ్ బాస్..తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా దూసుకుపోతుంది ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు ఓటీటీ ద్వారా 24 గటలు లైవ్ లో వస్తుంది. అయితే సహజంగానే బిగ్ బాస్ అంటే అందరికి .. ఓ నమ్మకం. అక్కడ జరిగేది చూయించరని..వాళ్లకు కావాల్సిన ఎలిమెంట్స్ మాత్రమే కట్ చేసి చూయిస్తారని చాలా మంది సామాన్యులు..అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటకు వచ్చిన తమ వీడియోలను చూసుకున వారు ఇదే విషయాని చెప్తారు.

కాగా, బిగ్ బాస్ షో స్టార్ అయ్యిన్నప్పటి నుండి చాల మంది ఈ షో పై తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి కొందరు మీడియా ముందుకే వచ్చే బూతులు తిడుతున్నారు. బోనస్ గా హోస్ట్ గా చేస్తున్న నాగార్జునను కూడా తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ హౌస్‌పై సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. అలాంటి ఇలాంటి హాట్ కాదు ..కాంట్రవర్షీయల్ హాట్ కామెంట్స్. బిగ్ బాస్ షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని..దానికి నాగార్జున హోస్ట్ గా చేయడం ఏంటి అని..లోపల జరిగేటివి చూస్తుంటే.. అసలు అది బిగ్ బాస్ హౌస్ కాదని.. గేమ్‌ కాదని, లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌస్‌ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

నారాయణ మాటలకు హర్ట్ అయిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్..ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అంతేకాదు తీవ్ర స్దాయిలో మండిపడుతూ చెప్పుతో కొట్టాలి అంటూ కామెంట్ చేశారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్‌ డిబేట్‌లో పాల్గొన్న ఆమె ..బిగ్‌బాస్‌ షో గురించి మాట్లాడుతూ..ఈ షో వల్ల మాలాంటి వాళ్లకి చాలా గుర్తింపు వచ్చిందని..ఉపాధి కలుగుతున్నాయని ..మీకు ఒకవేళ షో నచ్చకపోతే ప్రాబ్లం లేదు ఛానెల్‌ మార్చుకోండి అంతేకానీ ఇలా బ్రోతల్ హౌస్ అంటూ చీప్ గా మాట్లాడే వాళ్ళని చెప్పుతో కొట్టాలంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది. దీంతో ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.