మారుతి సినిమాకు ప్రభాస్ పెట్టిన ఒక్కేఒక్క కండీషన్ ఇదే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..తగ్గేదేలే అన్నట్లు వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీ బిజీ గా ఉన్నాడు. బాహుబలి సినిమాతో తన రేంజ్, రెమ్యూనరేషన్ రెండు మార్చేసుకున్న ఈయన..ఇప్పుడు ఏ హీరో కూడా టచ్ చేయలేనంత భారీ పారితోషకాని తీసుకోవడమే కాకుండా..అదే రేంజ్ బడ్జేట్ లో సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్నీ సినిమాల బడ్జేట్ 150 కోట్ల పైమాటే. ఇక సినిమా రిలీజ్ అయ్యాక అదే స్దాయిలో నే లాభాలు వస్తాయి. అదే మన డార్లింగ్ స్పెషాలిటీ.

కాగా గత కొన్ని రోజుల నుండి ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఓ రూమర్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని..ఆ సినిమాకి రాజా డీలక్స్’ అనే పేరు కూడా పెట్టారని మీడియా లో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అటు మారుతి కానీ, ఇటు ప్రభాస్ కానీ ఈ ప్రాజెక్ట్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు,,అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ ఈ సినిమా పై మాత్రం భీబత్సమైన రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి.

అయితే సినీ వర్గాల పెద్దల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వార్త నిజమే. ప్రభాస్..మారుతితో ఓ సినిమా చేయబోతున్నాడట. అఫిషియల్ గా ప్రకటించలేదు కానీ..బ్యాక్ గ్రౌండ్ లో అన్ని పనులు చక చకా పూర్తి చేసుకుంటున్నారట మారుతి. ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు చివరి దశలో ఉండగా.. మరోవైపు ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందట. ‘రాజా డీలక్స్’ కోసం భారీగా సెట్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా యువి క్రియేషన్స్‌లోనే తెరకెక్కనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రభాస్ మారుతితో పని చేయడానికి పెద్దగా అడ్దు ఏం చెప్పలేదట. ఆయన చిన్న డైరెక్టర్..పై ప్రభాస్ రేంజ్ బడ్జేట్ మూవీ కాదు..పారితోషకం కూడా తక్కువే ఇలా అభిమానులకు ఇలా డౌట్లు వచ్చినా..ప్రభాస్ మాత్రం అవి ఏం ఆలోచించలేదట. కానీ ఈ సినిమా చేయడానికి ఒక్కే ఒక్క కండీషన్ పెట్టాడట. కేవలం తను 60 Days కాల్ షీట్లు మాత్రమే అడ్జేస్ట్ చేయగలను అని ముందే చెప్పారట. దీనికి మారుతి ఓకే అన్నాకనే ప్రభాస్ ఈ సినిమా కి సైన్ చేసారట . రీసెంట్ సమాచారం ప్రకారం, రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారట చిత్ర బృందం. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే..?