నైజాం లో “భీమ్లా నాయక్” దుమ్ములేపిన ఫస్ట్ డే కలెక్షన్స్

దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ సినిమా “భీమ్లా నాయక్”.నిన్న రిలీజ్ అయినభీమ్లా నాయక్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాడు .అయితే మళయాళ చిత్రం “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా భీమ్లా నాయక్ చిత్రం తెరకెక్కింది అనే సంగతి అందరకి తెలిసిందే .ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ వసూళ్లు చేస్తున్నాడు భీమ్లా నాయక్ . పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ లేదా ప్లాఫ్ అనే టాక్ తో సంబంధం లేకుండా పవన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ ని అందుకుంటాయి.

అయితే భీమ్లా నాయక్ ఫస్ట్ డే కలెక్షన్స్ తీసుకుంటే అంతా అనుకుంటున్నట్టు గానే భీమ్లా నాయక్ నైజాం లో మొదటి రోజు రికార్డు వసూళ్లను అందుకొంది.నైజాంలో మొదటి రోజే 11.80 కోట్ల షేర్ ని అందుకొని ఆల్ టైం రికార్డు ను నమోదు చేసింది. ఈ లెక్కన భీమ్లా నాయక్ నైజాం లో మును ముందు కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది .