బ్రోతల్ హౌస్ లో స్టార్ హీరోయిన్..తల్లో మల్లెపూలు పెట్టుకుని ఏడుపు..ఎందుకంటే?

బ్రోతల్ హౌస్ అంటే అందరికి చిన్న చూపు. అక్కడ అందరు బరి తెగించిన ఆడవాళ్ళు ఉంటారనే అనుకుంటారు మగాళ్ళు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే..అక్కడకు వచ్చే మగాళ్లు కూడా అలాంటి వారే. ఒక ఆడది డబ్బులు కోసం అలాంటి పని చేస్తుంటే దానికి సమాజం ఇచ్చిన పేరు వ్యభిచారులు. మరి అలాంటి ఆడదాని దగ్గర కు అలాంటి పని కోసం వచ్చి డబ్బులు ఇచ్చే ఈ మాగాళ్లను ఏం అంటారు.. బరి తెగించిన మగాళ్ల..? మగవ్యభిచారులా..? ఇవన్ని ముంబైలోని బ్రోతల్ హౌస్ లో ఉండే అమ్మాయి..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని అడిగిన ప్రశ్నలు.

ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీగా ఉండే యంగ్ హీరోయిన్లలో అనుష్క శెట్టి పేరు ముందువరుసలో ఉండేది. అమ్మడు అందాలకు..పర్ ఫామెన్స్ కు కొట్లాది మంది జనం ఫిదా అయ్యారు. ముఖ్యంగా ప్రయోగాలు చేయడంలో అనుష్క లాగా ఏ హీరోయిన్ చేయలేదు అని అంటారు ఆమె అభిమానులు. సినిమా కోసం రిస్క్ అయిన ఎలిమెంట్స్ ఎన్నో చేసింది. ఇప్పటి వరకు మనం అనుష్క చేసిన సినిమాలు చూస్తే ఆ విషయం మనకి అర్ధమైపోతుంది. అయితే అనుష్క-బన్నీ-మనోజ్-దీక్ష లీడ్ రోల్ లో కలిసి నటించిన చిత్రం వేదం. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయినా..మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

ఈ సినిమాలో అనుష్క ఓ వ్యభిచారిగా నటించి అందరి షాక్ ఇచ్చింది. తల్లో మల్లెపూలు పెట్టుకుని.. చీరను వయ్యారంగా కట్టుకుని ఆ పాత్రకు న్యాయం చేసింది . ఇక ఈ సినిమా కోసం అనుష్క బ్రోతల్ హౌస్ కు కూడా వెళ్లింది అని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే అనుష్క అక్కడ ఉండి అలాంటి పనిచేస్తున్న అమ్మాయిలతో కొంచెం సేపు మాట్లాడి..మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు..అని అడగ్గా..అక్కడే ఉన్న ఓ అమ్మాయి చెప్పిన సమాధనం అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించాయట. ఇక్కడకు వచ్చే ప్రతి మగాడికి ఆడది కావాలి..ఇంట్లో భార్య ఉన్నా..మూతి మీద మీసం రాని కుర్రాడికి..తల నెరిసిపోయిన ముసలోడికి అందరికి ఆడది కావాలి..అలాంటి సుఖం కావాలి..కానీ మాకు డబ్బులు కావాలి..ఇంట్లో మగాడు చేతకాని వాడై తాగుబోతై సంపాదన లేకుండా ఉంటే..బిడ్డ ఆకలి అమ్మ అని అడుగుతుంటే..ఏం చేయలేని దిక్కు తోచని స్ధితిలో ఇలాంటి పనులు చేస్తున్నాం మేడం అంటూ చెప్పుకొచ్చిందట. ఇక ఆ మాటలకు అనుష్క కూడా ఏడ్చేసిందని అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమాలో క్రిష్ డబ్బు ఎంతటి పని అయినా చేయిస్తుంది అనే విషాయాని బాగా చూయించారు.


Leave a Reply

*