‘చాలా బాగుంది’హీరోయిన్ మాళవిక.. ఇలా మారిపోయిందేంటి?

ఒకప్పుడు ఇండస్ట్రీ లో హీరోయిన్గా రాణించిన ఎంతో మంది హీరోయిన్లు ఇప్పుడు మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారు. సోషల్ మీడియాలో వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటివారిని మళ్లీ తెర మీదికి తీసుకువస్తూ ఆసక్తికర ప్రశ్నలతో తన షోకి రేటింగ్స్ పెంచుకుంటున్నాడు కమెడియన్ ఆలీ. ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి ప్రస్తుతం స్టార్లుగా కొనసాగుతున్న ఆర్టిస్టులనే మాత్రమే కాదు.. వెండితెరపై కనుమరుగైన ఆర్టిస్టులను సైతం తీసుకువచ్చి ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నాడు అలీ.గత వారం టాలీవుడ్ విలన్ సంపత్ రాజ్ తో ముచ్చటించాడు. ఇక ఈ వారం ఒకప్పటి హీరోయిన్ మాళవికను తీసుకు వచ్చాడు.

చాలా బాగుంది సినిమా తో శ్రీకాంత్ జోడీ కట్టిన మాళవిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు అందుకుంది. తర్వాత బుల్లితెరపై కూడా నటించింది. తెలుగు తమిళం కన్నడం మలయాళం అనే తేడా లేకుండా అంతటా తన నటనతో ఇమేజ్ క్రియేట్ చేసుకుంది మాళవిక. చివరిసారిగా రజనీకాంత్ చంద్రముఖి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో సందడి చేసింది. ఇక ఇందులో మాళవిక ను ఆలీ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. మీరు సినిమాలు చూస్తున్నారా అని అడగగా ఇటీవలే పుష్ప సినిమా చూస్తానని స్పెషల్ సాంగ్ లో సమంత బాగా చేసింది అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అదే సమయంలో తన కెరీర్ లో జరిగిన కొన్ని గొడవల గురించి నిజం బయట పెట్టింది. చాలా బాగుంది సినిమా సమయంలో శ్రీకాంత్ తో తనకు గొడవ జరిగిందని.. రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో ఇబ్బందిగా ఫీల్ కావడంతో కంఫర్ట్ గా లేదు అంటూ చెప్తే శ్రీకాంత్ కోపంతో షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయారు ఇక అంతే కాకుండా అప్పుడు రేప్ సీన్ లో నటించినందుకు ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను అంటూ మాలవిక చెప్పింది. అయితే అప్పట్లో ఓ సినిమా షూటింగ్ సమయంలో రాజేంద్రప్రసాద్ మాళవిక ఈ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తించారు అంటూ చర్చ జరిగింది. ఇక అప్పట్లో మాళవిక పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడితే దర్శక నిర్మాతలు కూడా వద్దు అని సర్దిచెప్పారు అంటూ టాక్ వుంది. ఈ విషయాన్ని మళ్లీ బయటకు తీసేందుకు ప్రయత్నించాడు కమెడియన్ ఆలీ. రాజేంద్రప్రసాద్ గురించి అడుగగా కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు మాళవిక. ఇది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

సరే ఇదంతా పక్కన పెడితే చాలా రోజుల తర్వాత మాళవిక ను చూసిన అభిమానులు మాత్రం షాక్ అయ్యారు. 42 ఏళ్ళకే మాళవిక ఏళ్లు నిండిన ముసలమ్మల కనిపిస్తుంది ఏంటి అంటూ అనుకున్నారు. ఇదంతా ఆమె అందం తప్పు కాదు అక్కడ వేసిన మేకప్ తప్పు.. అంతేకాదు ఊ అంటావా ఉహూ అంటావా లాంటి ఐటం సాంగ్స్ కూడా చేస్తాను అంటూ చెబుతుంది మాళవిక. ఇలాంటి మేకప్ చూసిన తర్వాత ఎవరైనా డైరెక్టర్లు ఆమెకు అవకాశం ఇస్తారా అంటూ ఇక ఈ షోలో మాళవిక ను చూసిన తర్వాత కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.