భీమ్లా నాయక్: పవన్, రానా నే కాదు సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడట..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవ్వరి నొట విన్నా ఒకటే మాట ..భీమ్లా నాయక్ సినిమా అద్దిరిపోయింది. పవన్ నటన కేక..రానా కుమ్మేశాడు . ఇప్పుడు ఎవ్వరి నోట విన్న అదే మాటే వినిపిస్తుంది. కేవలం పవన్ ఫ్యాన్స్ నే కాదు.. సినిమా చూసి బయటకు వచ్చిన్ ప్రతి ఒక్కరు అదే చెప్పుతున్నారు. ఈ సినిమా లో పవన్ చెప్పే డైలాగ్స్ కి దానికి రానా ఇచ్చే ఎక్స్ ప్రేషన్స్..ఈ రెండింటికి మ్యాచ్ చేస్తూ ధమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..అన్నీ సినిమాకి బాగా కలిసి వచ్చాయి.

ముఖ్యంగా భీమ్లా నాయక్ సినిమాలో పవన్ నోటి నుండి వచ్చే ప్రతి డైలాగ్ ఆయనను బయట టార్గెట్ చేసే వాళ్లకి గట్టిగా ఆన్సర్ ఇచ్చే విధంగా రాసిన్నట్లు ఉన్నారు త్రివిక్రమ్ అంటున్నారు అభిమానులు. ఫస్ట్ హాఫ్ లో కధ కొంచెం స్లో గా వెళ్తుందని..కానీ ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్స్ చూసిన ఆయన అభిమానులు సీట్లలల్లో కూర్చోలేరని..ప్రతి ఒక సీన్ ను డైరెక్టర్ సాగర్ చంద్ర అంత అధ్బుతంగా తెరకెక్కించరని జనాలు పోగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రానా, పవన్ కాకుండా మరో హీరో లాంటి పాత్రను చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారట.

ఆమె మరెవరో కాదు..భీమ్లా నాయక్ సినిమాలో పవన్ భార్య గా నటించిన నిత్యా మీనన్. నిత్యా మీనన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పాత్ర చేసినా నేచురల్ గా ఉంటుంది. ఆ పాత్రలో లీనమైపోతుంది. ఇక భీమ్లా నాయక్ సినిమాలో అయితే అమ్మడు చించేసిందట. భర్తను అర్ధం చేసుకునే భార్యగా.. భర్త కు ప్రతి విషయంలోను అండగా నిలిచి వెనక వేసుకు వచ్చే భార్య గా..ఈ సినిమాలో నిత్యా ఇరగదీసింది అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో పవన్,రానా తరువాత హైలెట్ గా నిలిచిన పాత్ర ఏదైన ఉంది అంటే అది నిత్యాదే అంటూ సినిమా చూసిన జనాలు ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఇక ఈ మాటల బట్టి చూస్తే నిత్యా కెరీర్ మళ్లీ ఫాంలోకి వస్తుందని అనుకుంటున్నారు నిత్యా ఫ్యాన్స్.