పుష్ప ఐటెం సాంగ్ కోసం కు ఫస్ట్ అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?..అస్సలు నమ్మలేరు..!!

“పుష్ప-ది రైజ్ “.. డిసెంబరు 17న రిలీజ్ అయిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అసలే బన్నీ సినిమా.. దానికి తోడు సుకుమార్ డైరెక్షన్..పైగా హ్యాట్రిక్ కాంబో..ఇక అభిమానులు లెక్కలు ఎలా ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు. సుకుమార్ కూడా బన్నీ అభిమానులు టేస్ట్ కి తగ్గటు సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ..తను అనుకున్న రీతీలో సూపర్బ్ గా తెరకెక్కించారు. పై గా బన్నీ మాస్ లుక్ లో ఇరగదీశాడు. దీంతో అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చేసింది. ఫలితంగా నిర్మాతలు ఈ సినిమా ద్వారా కోట్లు లాభాలు అందుకున్నారు.

ఈ సినిమాలో రష్మిక నటన అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సామీ సామీ అంటూ వచ్చే పాటలో నడుము తిప్పేస్తూ..ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఈ సినిమాకి మరో బిగ్గేస్ట్ ప్లస్ పాయింట్ సమంత స్పెషల్ సాంగ్. కెరీర్ లోనే ఎప్పుడు లేని విధంగా ఐటెం సాంగ్ కు సైన్ చేసి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. అంతేనా..హాట్ ఎక్స్ ప్రేషన్స్ తో సెక్సీ లుక్స్ ఇస్తూ ఆ లంగా జాకెట్ లో బన్నీ పై వాలిపోతూ మాస్ స్టెప్పులు వేసి కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇప్పటికి ఈ పాట వింటూ జనాలు ఊగిపోతున్నారంటే ఆ సాంగ్ అభిమానులకు ఎంత కిక్కెక్కించిందో అర్ధం చేసుకోండి.

అయితే, ఈ సినిమాలో ఐటెం సాంగ్ కు ముందుగా సుకుమార్ అనుకున్న హీరోయిన్ సమంత కాదట. అస్సలు సమంతను ఈ సినిమాలో తీసుకునే ఆలోచనే లేదట. కధ రాసుకున్నప్పుడే ఈసినిమాలో ఆటో బాంబ్ లాంటి ఫిగర్ ని ఐటేం సాంగ్ కి అనుకున్నారట. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. బికినీలతో పిచ్చెక్కించే ఈ బ్యూటీని పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనుకున్నారట. కానీ అమ్మడు ఊహించని స్దాయిలో రెమ్యూనరేషన్ అడగటంతో..సుకుమార్ యూటర్న్ తీసుకుని అప్పుడే భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిన సమంతను అప్రోచ్ అయ్యారట. ఫస్ట్ సమంత కూడా ఒప్పుకొలేదట. కానీ సుక్కు, బన్నీ ఆమెను దగ్గరుండి ఒప్పించారట. ఫైనల్ గా పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.