ప్రభాస్ సాలార్ పార్ట్ -2 అప్ డేట్ ..ఇది నిజమేనా ?

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాకే స్టార్ .ఒకటి కాదు ,రెండు కాదు దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలతో దాదాపు రెండు వేలకోట్ల సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న స్టార్ మన ప్రభాస్ .ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో కనడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ‘సాలార్ ‘ ఒకటి .ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది కరోనా కారణంగా షూటింగ్ పూర్తి కాలేదు .మరోవైపు ప్రశాంత్ కూడా ఆక్షన్ ఎపిసోడ్స్ రీ షూట్ చేస్తున్నాడట .

అయితే ఇప్పుడు కొత్తగా మరో ప్రచారం మొదలైంది .ప్రశాంత్ నీల్ని స్టార్ డైరెక్టర్ చేసిన కే .జి ఎఫ్ 2 మాదిరే సాలార్ కూడా రెండు పార్టులుగా రాబోతుంది అని సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తుంది .గతంలో బాహుబలి ,కే .జి .ఎఫ్ ,పుష్ప సినిమాలు కూడా ముందు ఒక సినిమాగా మొదలై రెండు పార్టులుగా మారిన సంగతి తెలిసిందే .ఇప్పుడు సాలార్ కూడా అదే మాదిరి రెండు పార్టులుగా రాబోతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ ఒక లాజిక్ స్ప్రెడ్ చేస్తున్నారు .రెండు పార్టీలు తెరకెక్కుతుంది కాబట్టే మళ్లీ రీ షూట్ చేస్తున్నారని యాక్షన్ సన్నివేశాలను కూడా టెక్నలాజి సాయంతో హాలీవుడ్ రేంజిలో సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు .మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని ,రెండో భాగం 2023 సమ్మర్లో రిలీజ్ చేస్తారని టాక్ .ఇప్పటివరకు అయితే ఫిలిం మేకర్స్ నుండి ప్రచారంపై ఎలాంటి స్పందన లేదు .అలాని నిజమే అన్నది కూడా లేదు .మరి మేకర్స్ రెస్పాండ్అయితే కానీ ఎలాంటి దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాదు.