విశాఖలో మైనర్ బాలికల రచ్చ.. ప్రియుడి కోసం ఇద్దరు అమ్మాయిల కొట్లాట!

ఒకే అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్లాడుకోవడం మనం చాలాసార్లు చూశాం. ఒక్కోసారి ఈ అంశం ఎక్కడివరకు వెళ్లేదంటే, ఆ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించిన కారణంగా పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు చాలా మందికి ఎదురయ్యింది. కాగా తాజాగా ఇలాంటిదే ఓ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖలోని అనకాపల్లి పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అనకాపల్లి పట్టణంలోని బస్టాండ్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు జుట్టు పీక్కొని పిడిగుద్దులతో చితకబాదుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు అబ్బాయిలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ అమ్మాయిలు మాత్రం కొట్టుకోవడంలోనే బిజీగా ఉన్నారు. దీంతో స్థానికులు అసలు వారిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారా అనే ఆలోచనలో పడ్డారు. అయితే అసలు విషయం తెలుసుకున్న స్థానికులు వారి చేష్టలకు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ వారిద్దరు దేనికోసం జుట్టు పీక్కొని మరీ కొట్టుకున్నారో తెలుసా.. తమ ప్రియుడి కోసం. అవును.. మీరు చదివింది నిజమే.. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయి కోసం ఇంతలా కొట్టుకుంటూ రోడ్డుపై రచ్చ రచ్చ చేశారు.

పైగా వారిద్దరు కూడా మైనర్లు కావడం ఇక్కడ మరో విశేషం. అయితే ఈ గొడవ గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఇద్దరు అమ్మాయిలో పాటు వారి ముద్దుల ప్రియుడిని కూడా పోలీసు బండిలో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి వయసును దృష్టిలో పెట్టుకుని వారికి స్ట్రాంగ్ కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. తమ తల్లిదండ్రులు కాలేజీకి పంపించేందుకు చదువుకునేందుకు అని.. ఇలా ప్రేమ మోజులో రోడ్డుపై పడేందుకు కాదంటూ వారికి నానా గడ్డి పెట్టి ఇళ్లకు పంపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ పూర్తి వైరల్‌గా మారింది.

https://www.youtube.com/watch?v=pq9ZhlML8VM