వాళ్లు రమ్మన్న గదుల్లోకి వెళ్లాల్సిందే.. ర‌మ్య‌కృష్ణ బోల్డ్ కామెంట్స్‌!

క్యాస్టింగ్ కౌచ్.. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధానంగా వినిస్తున్న పేరు. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్న ఈ చీక‌టి కోణంపై ఎంద‌రో నటీమణులు ఓపెన్‌గానే కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో త‌మ‌ ఎదురైన చేదు అనుభవాలను బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.

టాలీవుడ్‌లోనూ ఎంద‌రో తార‌ల ఇండ‌స్ట్రీలో ప‌డుకోక‌పోతే అవ‌కాశాలు రావ‌ని నేరుగానే ఓపెన్ అవుతున్నారు. ఈ విష‌యంలో సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ సైతం బోల్డ్ కామెంట్స్ చేసింది. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌మ్య‌కృష్ణ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. `ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఓ నటి స్టార్ గా ఎదగాలంటే తప్పకుండా అడ్జ‌స్ట్‌మెంట్ అవుతూ దర్శకనిర్మాతలకు లొంగి పోవాల్సిందే.

వాళ్లు రమ్మన్న గదులలోకి వెళ్లాల్సిందే, అలా వెళ్ళినప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి, అప్పుడే హీరోయిన్లు కెరీర్‌లో ముందుకు వెళ‌తారు` అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. దీంతో అప్ప‌ట్లో ర‌మ్య‌కృష్ణ కామెంట్స్ సోష‌ల్ మీడియా తెగ వైర‌ల్ అయ్యాయి. అలాగే ర‌మ్య‌కృష్ణ వ్యాఖ్య‌లు ఎంద‌రినో షాక్‌కి గురి చేశాయి.

కాగా, ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగిన ర‌మ్య‌కృష్ణ‌.. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా బాహుబ‌లి సినిమాతో ర‌మ్య‌కృష్ణ క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో వ‌ర‌స‌గా స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తూ ర‌మ్య‌కృష్ణ స‌త్తా చాటుతోంది.