పుష్ప మూవీలో..దాక్షాయణిగా అందుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!

యాంకర్ అనసూయ ఒకవైపు బుల్లితెర పై.. మరొకవైపు గ్లామర్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెళ్ళువలా పడుతున్నాయని చెప్పవచ్చు. అనసూయ తనకు నచ్చిన పాత్రలను ఏరి కోరి ఎంచుకొని మరీ చేస్తూ ఉంటుంది. ఇక సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలంలో రంగమ్మత్త గా మెప్పించిన అనసూయ. తాజాగా ఇప్పుడు పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో బాగానే అనిపించింది.

మంగళం శ్రీను భారీగా ఏమాత్రం కనికరం లేని పాత్రలో చాలా బోల్డ్ గా నటించింది దాక్షాయణి. ఒంటినిండా బంగారంతో అనసూయ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించేలా చేసింది. పుష్ప-1 లో అనసూయ పాత్ర చాలా తక్కువగా ఉన్నప్పటికీ సెకండాఫ్ లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటోంది అన్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా కోసం కేశయ్య భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

రోజుకి షూటింగ్ కోసం అనసూయ.. రూ.1.4 నుండి రెండు లక్షల వరకు అందుకుంటున్నట్లుగా సమాచారం. పార్ట్-1 లో ఎక్కువ రోజులు షూట్ చేసింది అనసూయ అని చెప్పవచ్చు. ఇక ఈమె రోజుకు రూ.రెండు లక్షలు అంటే దాదాపుగా ఒక స్టార్ హీరోయిన్ అందుకున్నట్లు సమాచారం. అయితే మరికొంతమంది మాత్రం అనసూయ దాక్షాయణి పాత్రలో మెప్పించలేకపోయింది అనే టాక్ వినిపిస్తోంది. అయితే పార్ట్ -2 లో అయినా మెప్పిస్తుంది ఏమో వేచి చూడాల్సిందే.