ఎన్టీఆర్ ఆలాంటి అవకాశం కోసం ఎదురు చూపులట..!

రామ్ చరణ్ , ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ..RRR . ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా లెవెలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రచారాన్ని చాలా వేగవంతం చేస్తోంది. ఇటీవల ముంబై ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన ఎన్టీఆర్.. అక్కడ పలు కార్యక్రమాలలో పాల్గొని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేసారు. ఈ క్రమంలోనే తన బాలీవుడ్ ఎంట్రీ పై ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఒక విలేకరి నేరుగా హిందీలో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగగా.. తాను బాలీవుడ్ లో సినిమా అవకాశం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలియజేశారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు వస్తే ఖచ్చితంగా నటిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. కానీ రామ్ చరణ్ మాత్రం జంజీర్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎనిమిది సంవత్సరాల క్రిందటే ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

RRR మూవీని రూ. 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. ఇక ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, మొదలగువారు ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాపై మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం.