మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముచ్చటగా మూడోసారి నటసింహం నందమూరి బాలకృష్ణతో `అఖండ` చిత్రాన్ని తెరకెక్కించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
అఖండ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో.. డైరెక్టర్ బోయపాటితో సినిమాలు చేసేందుకు పలు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నారు. ఈ లిస్ట్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒకటని తెలుస్తుండగా.. ఇప్పటికే బోయపాటికి మైత్రీ నిర్మాతలు అడ్వాన్సు కూడా ఇచ్చారట.
అయితే వినయ విధేయ రామ సినిమా విడుదలకు ముందు.. బోయపాటితో ఓ సినిమా చేసేందుకు మైత్రీ వారే అడ్వాన్స్ ఇచ్చారు. కానీ, భారీ అంచనాల నడుమ విడుదలైన వినయ విధేయ రామ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. దీంతో మేత్రీ నిర్మాతలు ఇచ్చిన అవ్వాన్స్‌ను వెనక్కి తీసుకుని బోయపాటిని అవమానించారు.
అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇప్పుడు అఖండ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బోయపాటితో మైత్రీ వారు మళ్లీ ప్యాచప్ అయిపోయారు. హీరో ఎవరన్నది పక్కన పెడితే త్వరలోనే బోయపాటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా రాబోతోంది. మొత్తానికి ఈ రకంగా అవమానం జరిగిన చోటే బోయపాటికి సన్మానం జరిగినట్టైంది.