క్యాన్స‌ర్ బారిన‌ ప‌డ్డ‌ హంస‌ నందిని.. ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

హంస‌ నందిని.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అయితే ఈమె క్యాన్సర్‌ బారిన పడింది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ డ్‌-3తో హంస నందిని బాధ‌ప‌డుతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గుండుతో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ `నాకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌. గ్రేడ్‌-3తో బాధపడుతున్న. ప్రస్తుతం కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నాను` అని చెప్పింది.

అంతేకాదు, క్యాన్స‌ర్‌ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేద‌ని, నవ్వుతూ ధైర్యంగా పోరాడాలనుకుంటున్నాన‌ని తెలిపిన హంస నంద‌ని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానని పేర్కొంది. 18 ఏళ్ల క్రితం హంసా తల్లి కేన్సర్‌తోనే మృతి చెందారు. త‌ల్లి నుంచి ఇప్పుడా వ్యాధి హంస‌కు మ‌వంశపారంపర్యంగా వ‌చ్చింది.

ఇక హంస నందిని క్యాన్స‌ర్ బారిన ప‌డింద‌ని తెలియ‌డంతో.. ఆమె అభిమానులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే సోష‌ల్ మీడియా ద్వారా హింస త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాక్షిస్తున్నారు. కాగా, మరాటీ కుటుండానికి చెంద‌ని ఈ అందాల తార.. మోడలింగ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసి ఆపై పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది.

ఇక `ఒకటవుదాం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన హంస నందిని.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. కానీ, స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసి సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది. ముఖ్యంగా మిర్చి, అత్తారింటికి దారేది, లెజెండ్ చిత్రాల్లో హంస చేసిన స్పెష‌ల్ సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.

https://www.instagram.com/p/CXsPc1dBXxa/?utm_source=ig_web_copy_link