గంగూలీ – నగ్మ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారా? ఆ ఫొటో చూసి సౌరవ్ భార్య డోనా ఏం చేసింది?

సౌరవ్ గంగూలీ. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. మిగతా అందరు ఆటగాళ్లలా సౌరవ్ నానా కష్టాలు అనుభవించి టీమ్ లో స్థానం సంపాదించలేదు. అతనిది రాయల్ ఫ్యామిలీ. చిన్ననాటి నుండి క్రికెట్ మీద ఫికస్ పెట్టాడు. ఎడమ చేత్తో బాల్ ని చితక్కొట్టాడు. సెలెక్టర్లుకి దాదా విలువ అర్ధం అయ్యింది. టీమ్ లో రాజమార్గం ఏర్పడింది. అప్పటి వరకు సచిన్ మాత్రమే దిక్కుగా ఉన్న ఇండియన్ క్రికెట్ కి దాదా కొత్త జీవం పోశాడు. వేగవంతమైన బ్యాటింగ్ తో స్థిరంగా రాణించడంతో గంగూలీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక గంగూలీ ఫ్రన్ట్ కి వచ్చి కొట్టే సిక్స్ లకి అప్పట్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది.

గంగూలీ ఇలా ఆటగాడిగా అత్యున్నత స్థాయిలో ఉండగానే ఇండియన్ టీమ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం మొదలయింది. టీమ్ కి సరైన కెప్టెన్ లేకుండా పోయాడు. టీమిండియా అటతీరు దారుణంగా పడిపోయింది. ర్యాంకింగ్స్ లో జింబాంబ్వే తరువాత స్థానానికి పడిపోయాము. సరిగ్గా.. ఇలాంటి స్థితిలో కెప్టెన్ అయిన గంగూలీ ఇండియన్ క్రికెట్ లో నవశకానికి తెర లేపాడు. టీమిండియాకి దూకుడు మంత్రం విదేశాల్లో విజయాలు సాధించడం నేర్పింది కూడా దాదానే. టీమ్ లోకి కొత్త కుర్రాళ్లను తీసుకొచ్చి, టీమ్ ని బలంగా చేయడం గంగూలీ పాత్ర మరువలేనిది. దీంతో.. ఇండియాలో దాదా క్రేజ్ ఆకాశాన్ని అంటింది. సరిగ్గా ఇలాంటి సమయంలో గంగూలీ జీవితంలోకి వచ్చింది నగ్మా. ఇద్దరి మధ్య ఏమి నడిచిందో తెలియదు గాని, ఇద్దరూ కలసి బయట తిరగడం మీడియా కంట పడింది. అప్పటి వరకు తమ మధ్య వచ్చిన ప్రేమ వార్తలను పుకార్లు అంటూ ఖండించిన దాదా.. భార్యా డోనా ముందు మాత్రం అడ్డంగా దొరికిపోయాడు.

తిరుపతిలో నగ్మా, గంగూలీ ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారన్న టాక్ బయటకి వచ్చింది. దీంతో.. డోనా విడాకులకు సిద్ధమైంది. మరోవైపు గంగూలీ ఆటతీరు దారుణంగా మారిపోయింది. అన్నీ వైపుల నుండి విమర్శల మధ్య గంగూలీ నగ్మాకి దూరంగా వచ్చేశాడు. భార్యకి నచ్చ చెప్పుకున్నాడు. టీమ్ లో స్థానం కోల్పోయాక మళ్ళీ ఆటపై ద్రుష్టి పెట్టాడు. రంజీల్లో పరుగుల వరద పారించి మళ్ళీ టీమ్ లో స్థానం దక్కించుకున్నాడు. కానీ.., నగ్మా మాత్రం గంగూలీ తన జీవితంలో నుండి ఒక్కసారిగా తప్పుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. కానీ.., గంగూలీ నిర్ణయానికి గౌరవం ఇచ్చి ఒంటరిగా మిగిలిపోయింది. చూశారు కదా? ఇది గంగూలీ-నగ్మా లవ్ స్టోరీ. ఈ వియషంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Share post:

Latest