టాలీవుడ్లో మాస్ మసాలా ఐటెం సాంగ్స్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే ఈ ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.
కాగా ఈ సినిమా నుండి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉండబోతున్నట్లు గతకొద్ది రోజులుగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తూ వస్తోంది. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో ఎవరు చిందులేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, తాజాగా ఈ సాంగ్‌లో స్టార్ బ్యూటీ సమంత ఐటెం గర్ల్‌గా మారుతున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో సామ్‌ను వెనుక నుండి చూపించారు. ఈ పాటను అతి త్వరలో రిలీజ్ చేస్తు్న్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌తో కనిపిస్తుండగా, ఇప్పుడు సమంత లాంటి స్టార్ బ్యూటీ ఐటెం పాపగా మారుతుండటంతో వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి మాస్ మసాలా సాంగ్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోండగా, ఈ సినిమాను డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.