పాపం.. ఆ హీరో పెదవికి పాతిక కుట్లు.. అయినా పట్టు వదల్లేదుగా!

November 30, 2021 at 9:33 pm

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’పై కేవలం బాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. నాని కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేక చిత్రంగా నిలవడంతో, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు.

దీంతో ఈ సినిమాపై ఇతర భాషల దర్శకనిర్మాతల దృష్టి పడింది. ఈ సినిమాను తమ భాషలో రీమేక్ చేసేందుకు చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ప్రయత్నిస్తున్నారు. కాగా బాలీవుడ్‌లో ఈ సినిమాను హీర షాహిద్ కపూర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అక్కడ కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో షాహిద్ కపూర్ నిజంగానే క్రికెట్ ఆడటం నేర్చుకుంటుండగా.. అనుకోకుండా ఓ గాయం అయ్యింది.

గ్రౌండ్ క్రికెట్ ఆడుతుండగా తన కింది పెదవికి బాల్ బలంగా తాకడంతో 25 కుట్లు పడ్డాయని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చాడు. బాల్ బలంగా తాకడంతో పెదవి చిట్లిందని అందుకే అన్ని కుట్లు పడ్డాయని.. ఈ గాయం వలన తన పెదవి ఎప్పటికీ పనిచేయదేమో అని తాను భయపడినట్లు షాహిద్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సినిమాలోని తన పాత్ర కోసం మూతి పగలగొట్టుకున్న ఈ హీరో డెడికేషన్‌కు అటు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా హ్యాట్సాఫ్ కొడుతున్నారు.

పాపం.. ఆ హీరో పెదవికి పాతిక కుట్లు.. అయినా పట్టు వదల్లేదుగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts