రాధే శ్యామ్ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సారి ఫ్యాన్స్ శాటిస్పై కావడం పక్కా..!

బాహుబలి సినిమా ఎప్పుడైతే మొదలైందో అప్పటినుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కు దూరమవుతూ వచ్చాడు. పాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకున్న ప్పటికీ ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ చిత్ర నిర్మాతలు ఇవ్వడం లేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో అభిమానులను పాటలు బాగా నిరాశ పరిచాయి. ఒక్కటంటే ఒక్క పాట కూడా అభిమానులను ఆకట్టుకోలేదు.

సాహో తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అయినా పాటలు మంచి విజయాన్ని సాధిస్తాయని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు ఫలించటట్లే ఉన్నాయి. ఇటీవలి కాలంలో సింగర్ సిద్ శ్రీరామ్ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో సిద్ శ్రీరామ్ పాడిన పాటలు సంగీత అభిమానులను ఆకట్టుకున్నాయి.

సిద్ శ్రీరామ్ తాజాగా రాధే శ్యామ్ సినిమాలో కూడా ఒక మెలోడీ సాంగ్ పాడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పాట ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు హోప్స్ పెట్టుకున్నారు. రాధే శ్యామ్ సౌత్ వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. రాధే శ్యామ్ నుంచి రాతలే అనే సాంగ్ ఇదివరకే విడుదలైంది. ఇప్పుడు తాజాగా సిద్దు శ్రీరామ్ పాడిన పాట అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి మేకర్స్ సన్నాహాలు కూడా చేస్తున్నారు. సిద్దు శ్రీరామ్ పాడిన పాట ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.