ఎన్టీఆర్ విశ్రాంతి వెనుక.. అసలు కథ ఇదే..!

టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ ,జనవరి తర్వాత కొత్త సినిమా షూటింగును మొదలు పెట్టనున్నారు. ఎన్టీఆర్ హోస్టుగా జెమినీ ఛానల్లో ప్రసారం అవుతున్న” ఎవరు మీలో కోటీశ్వరులు” షో ఎపిసోడ్ లకు సంబంధించిన షూటింగ్ లు కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అయితే తాజాగా ఎన్టీఆర్ రెండు నెలలు విశ్రాంతి తీసుకోపోతున్నాడు అనే వార్త బాగా వైరల్ గా మారుతుంది.

RRR సినిమాతో హిందీ ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. అందుకు సంబంధించిన ప్లాన్ ను చేస్తున్నారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అందుకోసమే తన సినిమా షూటింగులను కూడా వాయిదా వేశారని వార్త వినిపిస్తోంది. అందులో భాగంగానే హిందీ లో ప్రసారమయ్యే ఒక రియాలిటీ షో లో కూడా గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

అందుకోసమే ఎన్టీఆర్ రెండు నెలల సమయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక తాజాగా నటించిన RRR సినిమా ను పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా సక్సెస్ అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ లెవెల్ లే మారిపోతుంది.