పుష్ప సినిమాలో.. సమంతనా..!

November 14, 2021 at 3:16 pm

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ గా రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రచార పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ నటిస్తోంది అన్నట్లుగా సమాచారం వెలువడింది. వాటి వివరాలను చూద్దాం.

ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అనసూయ, సునీల్, ఫాహద్ ఫాజిల్ వంటి వారు నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో సమంత ఒక ఐటెం సాంగ్ లో నటిస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం సమంత కూడా ఓకే చెప్పినట్లు గా కూడా వార్త వినిపిస్తోంది.

ఇక రంగస్థలం సినిమా లో కూడా పూజ హెగ్డే ఐటెం సాంగ్ లో నటించింది. ఇక అల్లు అర్జున్ సినిమాలో సమంత నటించి అభిమానులను సంతోషపరుస్తుంది అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

పుష్ప సినిమాలో.. సమంతనా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts