ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

November 8, 2021 at 10:44 am

దాదాపుగా ఎన్టీఆర్ మూడు సంవత్సరాల పాటు RRR సినిమా కోసం క్షణం తీరికలేకుండా గడిపాడు. ఇక తాజాగా కాస్త ఫ్రీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి కొద్ది రోజులలో కొరటాల శివతో కలిసి ఒక సినిమాలో కనిపించనున్నాడు. ఆ లోపుగా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతున్నాడు.

రీసెంట్ గా తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు చాలా అంగరంగవైభవంగా జరుపుకున్నాడు ఎన్టీఆర్. తన కుమారుడు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు ఎన్టీఆర్. తాజాగా తన భార్య లక్ష్మి ప్రణతి పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఇతర స్నేహితులతో కలిసి తన పార్టీని చాలా గ్రాండ్ గా చేసుకున్నారు.

ఇక ఈ ఫోటోలో ఎన్టీఆర్ చేతికి బ్యాండ్స్ తో కనిపించాడు. దీంతో ఆయన అభిమానులు కొంచెం బాధ పడినట్లుగా కామెంట్ రూపంలో తెలియజేశారు. జిమ్లో వర్కవుట్ చేస్తున్న సమయంలో ఈ గాయం అయినట్లుగా సమాచారం. ఇది నయం కావడానికి కనీసం మూడు వారాలు అయిన పడుతుందట.NTR partied with friend and family members

ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts