‘స్పిరిట్’లో అంతా తూచ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ రీసెంట్‌గా అనౌన్స్ చేసిన చిత్రం ‘స్పిరిట్’.

అర్జున్ రెడ్డి వంటి చిత్రంతో కల్ట్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొరియన్ హీరోయిన్ సాంగ్ హై క్యోను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించినట్లు వార్తలు వచ్చాయి.

కానీ ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించలేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇదంతా కేవలం పుకారు మాత్రమే అని తేలిపోయింది. ఇక ప్రభాస్ సరసన ఓ ఇండియన్ స్టా్ర్ బ్యూటీని తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుండగా, బాలీవుడ్ భామ కరీనా కపూర్ పేరు ఇందులో ముఖ్యంగా వినిపిస్తోంది. మరి స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఎవరని తీసుకుంటారా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.