జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన కోట?

నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ తో కలిసి బృందావనం సినిమా కంటే పలు సినిమాలు చేసినా కూడా ఆ సినిమా మాత్రం ఆయనకు సంతృప్తి నిచ్చిందట.

బృందావనం సినిమా సమయంలో కోట శ్రీనివాసరావు కొడుకు మరణించాడని తెలిపారు. ఇక బృందావనం సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా గమ్మత్తుగా ఉండేదని, ఆ పాత్రలో ఎన్టీఆర్ టెంపో బాగా మెయింటైన్ చేశారని తెలిపారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్,శ్రీహరి నటించారు అంతమంది ముందు ఎన్టీఆర్ పోటీ పడి నటించిన నెగ్గుకు రావడం అనేది చాలా కష్టమైన పని అది ఆయనకు మాత్రమే తెలుసు. అలాంటి పాత్రను ఎన్టీఆర్ చేశాడు అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు కోట. ఈ సినిమాలో ఎన్టీఆర్ తాత పాత్రలో నటించాడు కోటా శ్రీనివాసరావు.