కమల్ హాసన్ ఎన్ని కోట్లకు ఆస్తిపరుడో తెలుసా..?

విశ్వ నటుడిగా గుర్తింపు పొందిన కమలహాసన్ ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇకపోతే ఈయన చదివింది కేవలం 8వ తరగతి అయినప్పటికీ కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంటే ఆయన తన నటనతో సినిమాల ద్వారా అంత ఆస్తి ని పోగు చేసినట్లు ఆయన శ్రేయోభిలాషులు చెబుతున్నారు. ఇంతకు కమలహాసన్ పోగుచేసిన ఆస్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్తుల విషయాలకు వస్తే.. రూ.176.93 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.లండన్ లో రూ.2.50 కోట్ల విలువ చేసే ఖరీదైన ఇల్లు, రూ.2.7 కోట్ల విలువచేసే లెక్సస్ కారు, ఒక కోటి రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు ఉన్నట్లు ఆయన తెలిపారు.ఇక గణాంకాల ప్రకారం ఇంతకు మించి ఆయనకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక కమలహాసన్ బిజినెస్ ల ద్వారా కూడా బాగానే వెనక్కి వేశాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఆయన ఆస్తులు రెండు వందల యాభై కోట్ల రూపాయలకి పైగానే ఉన్నాయని సినీ ఇండస్ట్రీలో వినికిడి.