మణిశంకర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల?

జివీకే దర్శకత్వంలో శివ కంఠమనేని, సంజన గల్రాని,ప్రియ హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మణిశంకర్.ఈ సినిమా యాక్షన్ ఎలిమెంట్స్ తో ఒక డిఫరెంట్ సస్పెన్స్ ధ్రిల్లర్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు, వెంకట కృష్ణన్.

లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎల్ శంకర్రావు ఆచార్య శ్రీనివాసరావు ఎం ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం.

ఈ మోషన్ పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచిగానే రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. ఈ రోజు విడుదలైన మా మణిశంకర్ టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే సంజన, ప్రియ లతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది.

కొత్త కాన్సెప్ట్ తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ.. మణిశంకర్ అనేది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని తెలిపారు.