మ‌గాళ్ల శీలం కోసం సంపూ పోరాటం.. ఫ‌న్నీగా `క్యాలీఫ్ల‌వ‌ర్‌` టీజ‌ర్‌!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టించిన తాజా చిత్రం `క్యాలీఫ్ల‌వ‌ర్‌`. ఆర్.కె మలినేని దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యాన‌ర్ల‌పై ఆశాజ్యోతి గోగినేని నిర్మించారు. పోసాని హీరోయిన్‌గా న‌టించ‌గా.. కృష్ణమురళి, ఫృధ్వీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 26న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ క్యాలీఫ్ల‌వ‌ర్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆద్యంతం సూప‌ర్ ఫ‌న్నీగా సాగిన ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

మ‌గాడి శీల ర‌క్ష‌ణ కోసం చ‌ట్టాన్ని తీసుకొచ్చేందుకు పోరాటం చేసే వ్య‌క్తిగా సంపూ ఈ మూవీలో క‌నిపించ‌బోతున్నాడు. ఏదేమైనా సంపూర్ణేష్‌బాబు శైలికి తగ్గట్లుగా సాగే విభిన్నమైన వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందించార‌ని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. మ‌రి లేటెందుకు మీరూ ఆ టీజ‌ర్‌పై ఓ లుక్కేసేయండి.