భీమ్లా నాయక్ నుంచి వీడియో ప్రోమో వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్.. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలురకాల వీడియోలు, ప్రోమోలు, చిత్రాలు విడుదలై ప్రేక్షకుల లో మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వీడియో కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం ఇది కూడా బాగా వైరల్ గా మారుతోంది..అంతేకాదు లా లా భీమ్లా అనే పాట నవంబర్ 7 వ తేదీన వీడియో సాంగ్ విడుదల కానున్నట్లు ఈ ప్రోమో లో వెల్లడించారు.

అయితే ఈ ప్రోమో లో పవన్ కళ్యాణ్..” మీకు ముందుగానే దీపావళి వచ్చింది.. హ్యాపీ దీపావళి..” అంటూ చెప్పే డైలాగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. సుమో లను తన రిమోట్ తో పేల్చుతూ అందరికీ హ్యాపీ దీపావళి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్.. ఇక దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు రాస్తూ..ఆ డైలాగులు సినిమాకే హైలెట్ గా నిలిచేలా చేస్తున్నాడు.. ఇక ఈ సినిమా 2022 జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.