సూపర్ స్టార్ సూర్య ప్రముఖ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం జై భీమ్..ఈ సినిమా అమెజాన్ వేదికగా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే.. కోర్టు బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి ఆదరణ దక్కించుకుంటోంది.. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి గురించి ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు.. జై భీమ్ సినిమా లో సూర్య సరసన నటించిన రాజిష విజయన్ ఎవరు..? సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది..? అనే విషయాల గురించి ప్రతి ఒక్కరు పెద్దఎత్తున వెతుకుతున్నారు..
ఇక ఈ హీరోయిన్ విషయానికొస్తే, ఈమె కేరళలోని కాలికట్ లో జన్మించింది ..డిగ్రీ పూర్తిచేసి టీవీ యాంకర్ గా కూడా పని చేసింది.. ఆ తర్వాత తమిళ్, మలయాళం లో పది చిత్రాలకు పైగా నటించి , మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సూర్య సరసన జై భీమ్ సినిమాలో కీలకపాత్ర పోషించింది ఈ అమ్మాయి.