విజయ్ సేతుపతి అనగానే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ఉప్పెన విలన్ గుర్తొస్తాడు. ఈ సినిమాలో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు విజయ్ సేతుపతి.. ఇక తమిళ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోగా గుర్తింపు పొందిన ఈయన తమిళ ప్రేక్షకులకు , తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇకపోతే తాజాగా విజయ్ సేతుపతి పై ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడం సంచలనంగా మారింది.
బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో వస్తుండగా విజయ్ సేతుపతి పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. వెంటనే పక్కనే ఉన్న పోలీసులు ఆ గుర్తు తెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కానీ రెండు రాష్ట్రాలలో మంచి అభిమానులున్న విజయ్ సేతుపతి కి ఇలా జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆ అజ్ఞాత వ్యక్తిని వెంటనే శిక్షించాలి అని, అలా ఎందుకు చేశాడో సమాధానం కావాలి అంటూ విజయ్ సేతుపతి అభిమానులు పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
எலேய்😳அவர ஏன்டா அடிக்குற😟 pic.twitter.com/FAqKIS0afC
— براسانث (@reachlez_handle) November 3, 2021