మహానటి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. తను హీరోగా నటించిన మలయాళ చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఉన్నాడు. తాజాగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆయన నటించిన “కురుప్” . ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార్ కురుప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. కురుప్ గోపి కృష్ణ అనే రెండు విభిన్న కోణాలలో దుల్కర్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో దుల్కర్ నటన చాలా అద్భుతంగా నటించాడు. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ దుల్కర్ సల్మాన్ నటన గురించి మాట్లాడుకుంటున్నారు. మొదటిసారి విభిన్న పాత్రలో , విభిన్న కోణాలలో ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు కాబట్టి ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.. హీరోయిన్గా శోభిత నటిస్తుండగా ఇంద్రజిత్ సుకుమారన్ ,సన్నివేన్ కీలక పాత్రలు పోషించారు..