ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్..!!

November 3, 2021 at 9:25 pm

భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా కొత్త కోచ్ గా భారత క్రికెట్ బోర్డు బుధవారం నియమించింది.. 48 సంవత్సరాల బ్యాటింగ్ దిగ్గజం ప్రస్తుత టి20 ప్రపంచకప్ తర్వాత జట్టు యొక్క బాధ్యతలు చేపట్టనున్నారు. తాజాగా ఈ విషయాన్ని శ్రీమతి సులక్షణ నాయక్ అలాగే మిస్టర్ ఆర్పి సింగ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం ఏకగ్రీవంగా మిస్టర్ రాహుల్ ద్రవిడ్ ను టీమిండియా హెడ్ కోచ్ గా నియమించింది.

ఇకపోతే న్యూజిలాండ్లో ప్రస్తుతం జరగనున్న హోం సిరీస్ నుండి భారత మాజీ కెప్టెన్ బాధ్యతలు స్వీకరిస్తాడు అని సమాచారం.. ఇక అలాగే బౌలింగ్ కోచ్ భారతి అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ,అలాగే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా పదవీ విరమణ చేయనున్నట్లూ సమాచారం. ఇక తన క్రికెట్ పదవీకాలం రవి శాస్త్రి కి ముగియనుండగా క్రికెట్ సంఘం సభ్యులు ఆయనను అభినందించారు.. ఇక ఈయనతోపాటు హెడ్ కోచ్ గా శాస్త్రి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే..ఈయన పదవి విరమణ చేపడుతున్నారు కాబట్టి ఆయన స్థానంలో రాహుల్ ద్రవిడ్ హెడ్ గా క్రికెట్ టీమ్ కు హెడ్ కోచ్ గా నియమించారు.

ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts