గుడ్ న్యూస్: కొవాగ్జిన్‌ టీకాకు WHO ఆమోదం …!

November 3, 2021 at 7:02 pm

కరోనా మహమ్మారి నిర్మూలన కొరకై భారతదేశ ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో దీన్ని ప్రజలందరికీ అందిస్తున్నప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అనుమతి లభించక విమర్శల పాలవుతోంది. అయితే గత కొన్ని నెలలుగా కొవాగ్జిన్‌ టీకా పనితీరును పరిశీలిస్తున్న డబ్ల్యూహెచ్‌వో తాజాగా భారత్‌ బయోటెక్‌ కు శుభవార్త అందించింది. కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్‌ ఆఫ్‌ లిస్టింగ్‌-ఈయూఎల్‌) చేర్చేందుకు ఆమోదం తెలిపినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు ఓ ట్వీట్‌ చేసింది.

ఎమర్జెన్సీ యూజ్‌ ఆఫ్‌ లిస్టింగ్‌ లో స్థానం దక్కించుకోవడం ద్వారా కొవాగ్జిన్‌ టీకా సమర్థతపై నెలకొన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. దాంతో ఈ టీకా తీసుకున్న భారత పౌరులు ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు కొత్తగా వేరే టీకా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా క్వారంటైన్ లో ఉండాల్సిన పని తప్పుతుంది. అలాగే ఈ టీకాలు వేరే దేశాలకు విక్రయించడానికి సాధ్యమవుతుంది. అలాగే మన దేశంలో కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారి రోగనిరోధక శక్తికి ఎలాంటి డోకా లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. నిన్నటి వరకు కొవాగ్జిన్‌ టీకా

గుడ్ న్యూస్: కొవాగ్జిన్‌ టీకాకు WHO ఆమోదం …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts