ప్ర‌భాస్‌-త్రిష ప్రేమాయ‌ణం..వామ్మో తెర వెన‌క అంత జ‌రిగిందా?

రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ వ‌య‌సు 40 దాటింది. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఈయ‌న ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లెక్కుతాడా అని అభిమానులు గ‌త ప‌దేళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, ఆ త‌రుణం మాత్రం రావ‌డం లేదు. మ‌రోవైపు ప్ర‌భాస్ ఎఫైర్ల‌పై ఎన్నెన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి.

16YearsForVarsham: Why it is one of the best films of Prabhas? | Telugu  Movie News - Times of India

ఈ క్ర‌మంలోనే గ‌తంలో చెన్నై చంద్రం త్రిష‌తో ప్ర‌భాస్ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకువ‌చ్చాయి. వీరిద్ద‌రూ మొట్ట మొద‌టి సారి `వ‌ర్షం` సినిమాలో జోడీ క‌ట్టారు. శోభన్ దర్శకత్వం వ‌హించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం 2004, జనవరి 14న విడుద‌లై ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Prabhas & trisha | Prabhas pics, Bollywood actress hot photos, Super movie

అలాగే ప్రభాస్ , త్రిష అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఆ త‌ర్వాత బుజ్జిగాడు, పౌర్ణమి వంటి సినిమాలలో నటించిన ఈ జంట నిజ జీవితంలో కూడా ప్రేమలో ప‌డ్డార‌ని.. పెళ్లి కూడా చేసుకుంటార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే వీరి వివాహానికి పెద్ద‌లు అంగీక‌రించ‌లేద‌ని.. అందు వ‌ల్లే ప్ర‌భాస్‌- త్రిష‌ల ప్రేమ విఫ‌లం అయింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

Bujjigadu

ఇక ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. అప్ప‌ట్లో ఈ విష‌యంపై పెద్ద పెద్ద చ‌ర్చ‌లే జ‌రిగాయి. కాగా, ప్ర‌భాస్ సినిమాలు విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న న‌టించిన రాధేశ్యామ్ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల కానుంది. అలాగే ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ చిత్రానికి ఇటీవ‌లె పూర్తి చేసుకున్న ప్ర‌భాస్‌.. మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్-కె చిత్రాలు చేస్తున్నాడు.