బాల‌య్య న‌యా రికార్డ్‌..దుమ్ములేపిన‌ `ఆన్ స్టాప‌బుల్‌` ప్రోమో!

నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `ఆన్ స్టాప‌బుల్‌`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఈ టాక్‌తో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షోలో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, ఆయ‌న కూతురు మంచు ల‌క్ష్మి, త‌న‌యుడు మంచు విష్ణు గెస్ట్‌లుగా విచ్చేశారు.

Unstoppable with NBK : తర్వాత ఎపిసోడ్స్ గెస్టులు వీళ్లే.. | Unstoppable with NBK

ఇందుకు సంబంధించిన ప్రోమోను కొన్ని గంట‌ల క్రిత‌మే ఆహా టీమ్ విడుద‌ల చేయ‌గా.. ఇప్పుడా ప్రోమో యూట్యూబ్‌లో దుమ్ములేపేస్తూ దూసుకుపోతోంది. `నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు `అంటూ బాల‌య్య చెప్పే డైలాగ్ తో స్టార్ అయిన ఈ ప్రోమో మ‌స్తు ఫ‌న్నీగా, సూప‌ర్ స్పైసీగా ఆక‌ట్టుకుంటోంది.

ఇక ఇప్పుడు ఈ ప్రోమోతోనే బాల‌య్య న‌యా రికార్డు క్రియేట్ చేశారు. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఆన్ స్టాప‌బుల్ ఫ‌స్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుద‌లైన రెండు గంట‌ల్లోనే 1 మిలియ‌న్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది. దాంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే అత్య‌ధిక వ్యూస్ సాధించిన ప్రోమోగా రికార్డు సృష్టించింది. కాగా, ఈ ప్రోమోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ దిపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న ఆహాలో ప్ర‌సారం కానుంది.

 

Share post:

Latest