అన్న ఆంధ్రాలో.. చెల్లి తెలంగాణ‌లో ఇదెక్క‌డి చోద్యం అమ్మా..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరో రెండు సంవత్సరాలలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచే ఆయన తన వంతు ప్రయత్నాలు గా నవరత్నాలలో ప్రవేశపెట్టిన అన్ని విషయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీర్చుకుంటూ వస్తున్నారు.. ఎలాగైనా సరే తనే గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి..

ఈయన చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించి.. అక్కడ సీఎంగా బాధ్యతలు చేపడతానని ముందుగానే తన తండ్రి , అన్న లాగే ఈమె కూడా పాదయాత్ర మొదలు పెట్టింది. ఇప్పటికే షర్మిల 100 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎన్నో కష్టాలు ఉన్నాయని.. కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఏ ఒక్కరు సంతోషంగా లేరని, వారి కష్టాలను తీరుస్తానని సంక్షేమ తెలంగాణ గా మార్చుతానని షర్మిల శపథం చేసింది..

ఇకపోతే ఇటు అన్న, అటు చెల్లి ఇద్దరూ రాజకీయ ముఖ్యమంత్రి పదవి కోసం తెగ ఆరాటపడుతున్నారు ఇదే గనుక జరిగితే రెండు రాష్ట్రాల ప్రజలు వైఎస్ కుటుంబీకు అధీనంలో ఉంటారని మరికొన్ని ప్రతిపక్ష వర్గాలు ఆరోపిస్తున్నాయి..