టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్ కార్ట్..?

ప్రస్తుత జనరేషన్ లో ప్రతి ఒక్కరు కూడా వస్తువుల నుంచి తినే తిండి వరకు ప్రతి ఒక్కటి కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరే వస్తువులు డిలీట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా కొన్ని సందర్భాలలో వేరే వస్తువులు తప్పకుండా వస్తాయి. కొన్ని సందర్భాలలో ఖాళీగా బాక్స్ లు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటివి సాధారణ వ్యక్తులకు కాకుండా సెలబ్రిటీలకు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా నటుడు అనుపమ ఫేమ్ పరాస్ కల్వనాథ్ ఫ్లిప్కార్ట్ లో ఉన్న నథింగ్ అనే బ్యానర్ కు చెందిన ఇయర్ ఫోన్ ను ఆర్డర్ చేశారట.

అయితే డెలివరీ వచ్చాక ఆధార్ ని ఓపెన్ చేసి చూసి నటుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. ఆయనకు వచ్చిన ఆడర్ లో నిజంగానే ఏమీ లేదు. ఈ కామర్స్ డెలివరీ తప్పిదాన్ని పరాస్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ త్వరలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతుందని, సేవల్లో నాణ్యత తగ్గుతుందని కాప్షన్ చేశారు.

https://twitter.com/paras_kalnawat/status/1448163886398590977?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1448163886398590977%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftv-actor-orders-nothing-earphones-flipkart-and-gets-nothing-box-1404352

ఈ విషయంపై స్పందించిన ఫ్లిప్ కార్ట్ సంస్థ జరిగిన దానికి మేము చింతిస్తున్నాం. ఆర్డర్ కి సంబంధించి మీకు ఏదైనా అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మేము మీకు సహాయం చేసేందుకు ఉన్నాం. దయచేసి ఆర్డర్ ఐడి మాకు షేర్ చేయండి. మేము దానిని పరిశీలించి మీకు సహాయం అందిస్తాం
. మీ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.