రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి పై పోలీస్ కేసు పెట్టిన హీరోయిన్?

October 16, 2021 at 9:31 pm

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఈ రెండు పేర్లు గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాయి. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు అయిన తర్వాత వీరిద్దరి గురించి తరచు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరి పేర్లను తక్కువగా వినిపించాయి. కానీ తాజాగా మరొకసారి వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీరు డబ్బు తీసుకొని తమని మోసం చేశారు అంటూ శిల్ప ఆమె భర్త రాజ్ కుంద్రా పై ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత హీరోయిన్ మోడల్ షెర్లిన్ చోప్రా తన పై ఆరోపణలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

తాజాగా ఆమె శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రా పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శిల్పా భర్త తనని మోసం చేశాడని మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె పోలీసులకు తెలిపింది. అంతే కాకుండా లైంగిక వేధింపులు నేరపూరిత బెదిరింపులు మోసం చేశారు అంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ చోప్రా పోలీసులను కోరినట్లు మీడియాతో తెలిపింది. అలాగే అతడిపై నమోదు అయిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆమె మీడియాకు చూపించింది. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు నేపథ్యంలో ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే జీవితం నాశనం చేస్తామంటూ బెదిరిస్తున్నారని అంటూ ఆమె ఆరోపణలు చేయడం మరొకసారి సంచలనంగా మారింది.

రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి పై పోలీస్ కేసు పెట్టిన హీరోయిన్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts