నెటిజెన్ కు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన రష్మిక మందన?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్రోలింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. హీరోయిన్ లకు అభిమానులు చిట్ చాట్ లో పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేస్తూ వారికి కోపం తెచ్చుకుంటారు. అంతేకాకుండా వారు పెట్టిన ట్వీట్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వాటిని ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని హీరోయిన్స్ చాలావరకు పట్టించుకోకుండా లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అవి వివాదాస్పదంగా మారినప్పుడు వాటికి స్పందించాల్సి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బ్యాడ్ గా కామెంట్ చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు.

తాజాగా హీరోయిన్ రష్మిక మందన కూడా ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురయింది. ఈ విషయాన్ని రష్మిక మందన వదిలేయకుండా నెటిజన్ కి స్ట్రాంగ్ గా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ ట్వీట్ చర్చనీయాంశం గా మారింది. సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా రష్మిక మందన నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫస్ట్ లుక్ ను దసరా పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రష్మిక మందన నవ్వుతూ ఉంటే శర్వానంద్ సిగ్గుపడుతూ కనిపించాడు. ఈ పోస్టర్ ని ఒక నెటిజన్ ట్రోల్ చేస్తూ దీన్ని సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారు అంటూ తన ఫోటోను షేర్ చేస్తూ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన రష్మిక వెంటనే నా నటన కోసం అంటూ అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.ఈ విషయం పై పలువురు నెటిజన్లు రష్మిక మందన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.