తనే నా కోడలు అంటున్న నాగబాబు..!!

మెగాబ్రదర్ నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ కు వివాహం చేయాలని ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన కూతురు నిహారిక వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించాడు.. త్వర లోనే నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ కు కూడా వివాహం చేస్తానని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.. ఇకపోతే నాగబాబు తాజాగా తనే నా ఇంటి కోడలు అంటూ ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ఆమె ఎవరో కాదు.. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ఆల్రెడీ ఒక సినిమాలో కూడా నటించింది.. అంతేకాదు వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కు ప్రాణ స్నేహితురాలు ఈ అమ్మాయి.. ఇక మెగా ఫ్యామిలీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా..తప్పకుండా ఈ అమ్మాయి హాజరు అవుతుందట.. ఇక ఈమె అందం అభినయంతో కలగలిసిన అందాలరాశి గా ఉండడంతో ఈమె నే తన కోడలు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు అట నాగబాబు.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ అమ్మాయిని తన కొడుకు వరుణ్ తేజ్ కు భార్యగా, తన ఇంటి కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ వార్తలు నిజం అవుతాయో లేదో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే..