దివ్యభారతి తో కలిసి డ్రగ్స్ తీసుకున్న అంటున్న నటి.. ఎవరంటే?

ఇటీవలే ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గత నాలుగైదు రోజులుగా ఎక్కడ చూసినా ఈ వార్త గురించి వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలుస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్, పూజాభట్, హృతిక్ రోషన్.. మద్దతు తెలుపగా తాజాగా మరొక సీనియర్ నటి సోమీ అలీ కూడా సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలిపింది.

ఆర్యన్ ఖాన్ చేసింది తప్పు కాదు అంటూ ఈమె తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. పిల్లలు డ్రగ్స్ వాడడం సహజం.. నాకు ఇది పెద్ద విచిత్రంగా ఏమీ అనిపించడం లేదు. వ్యభిచారం వంటి వాటిని పూర్తిగా తొలగించలేం. అందుకే వాటిని క్రిమినల్ జాబితాలో నుంచి తొలగించాలి. ఇక్కడ ఎవరూ కూడా సాధువులు కాదు. నేను కూడా 15 ఏళ్ల వయసులో డ్రగ్స్ తీసుకున్నాను అని నటి సోమి తెలిపింది. అలాగే ఆందోళన్ సినిమా తీస్తున్న సమయంలో దివ్యభారతి తో కలసి డ్రగ్స్ ట్రై చేసినట్లు సీనియర్ నటి తెలిపింది. ఈ విషయం చెప్పడానికి ఆమెకు గిల్ట్ ఫీలింగ్ లేదు అని ఆమె తెలిపింది.