ఆ వైరల్ పాట రవితేజ సినిమా లో ఉండబోతుందా..!

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వైరంగా వినిపిస్తున్న పాట”బుల్లెట్ బండి పాట”. ఈ పాటకు ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది.ఈ పాట నే రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో తీసుకోబోతున్నట్లుగా ఎక్కువగా వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వారితో చర్చలు జరిగాయి ఉన్నట్లుగా తెలుస్తోంది.

రవితేజ ఇదివరకే కొన్ని సినిమాల్లో కూడా ఇలాంటి పాటలను ప్రయోగం చేశారు.”కృష్ణ సినిమా లో అప్పిడి పొడే.. అనే పాటను అదరగొట్టిన విషయం మనకు తెలిసిందే.ఆ తర్వాత రాజా ది గ్రేట్ లో”జిడి గింజలు”అనే పాట తో అదరగొట్టేశాడు. ఇక తాజాగా రామారావు ఆన్ డ్యూటీ లో కూడా సరికొత్త పాటలు పెట్టి అలరించాలని చూస్తున్నారు.

రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా విషయానికి వస్తే రవితేజ ఈ సినిమాతో నిర్మాతగా పాలుపంచుకుంటున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ అందిస్తున్నారు. ఈ సినిమా లో రవితేజ ఒక కలెక్టర్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.అయితే ఈ సినిమా కూడా హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే.