విడాకులు ప్ర‌క‌టించి కాజ‌ల్‌ను తొక్కేసిన సమంత‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చి అక్కినేని ఫ్యామిలీతో తెగ‌దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త నెల రోజుల నుంచే సామ్‌-చైతులు డివోర్స్ తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా.. అక్టోబ‌ర్ 2న ఆ వార్త‌ల‌ను ఇరువురూ క‌న్ఫార్మ్ చేసేసి అంద‌రికీ షాక్ ఇచ్చారు.

Samantha changes her name on Twitter and Instagram after announcing separation from Naga Chaitanya - Movies News

అయితే ఈ క్ర‌మంలోనే కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను తొక్కేసింది స‌మంత‌. అస‌లు మ్యాట‌రేంటంటే.. విడాకుల వ్య‌వ‌హారం తెర‌పైకి రావ‌డంతో గ‌త కొద్ది రోజుల నుంచీ స‌మంత పేరు సోష‌ల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఎక్క‌డ చూసినా సామ్‌కు సంబంధించిన వార్త‌లే ట్రెండ్ అయ్యాయి.

Kajal Agarwal requests people to back small business after lockdown | Tamil Movie News - Times of India

అయితే ప్రతీ ఏడాది సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ జాబితాను విడుదల చేసారు ఆర్మాక్స్ మీడియా. తాజాగా ఈ ఏడాది లిస్ట్‌ను విడుద‌ల చేయ‌గా.. అందులో గతేడాది టాప్‌లో ఉన్న కాజల్ అగర్వాల్‌ను వెనక్కి నెట్టేసి అగ్ర స్థానం సొంతం చేసుకుంది సమంత.

Tollywood producers planning shoots without heroines

ఇక రెండో స్థానంలో కాజ‌ల్‌, మూడు స్థానంలో అనుష్క శెట్టి, నాలుగో స్థానంలో ర‌ష్మిక‌గా ఉండ‌గా.. త‌మ‌న్నా, కీర్తి సురేష్‌, పూజ హెగ్డే, ర‌కుల్‌, రాశీ ఖ‌న్నా మ‌రియు సాయి ప‌ల్ల‌విలు వ‌ర‌స‌గా త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు.