రజినీ తలైవర్.. తెలుగు సినిమా పై క్లారిటీ..!

కోలీవుడ్ తలైవర్ రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం రజినీ సినిమా “అన్నాత్తే” ని తెలుగులో కూడా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుచేతనే ఈ సినిమా తెలుగులో విడుదల అయ్యిందుకు దర్శకుడు శివ తెలియజేస్తున్నట్లు గా సమాచారం.

ఇక రజనీకాంత్ తెలుగులో ఎంత మంచి మార్కెట్ ఉందో మనకు తెలిసిన విషయమే. అందుకోసమే ఈ చిత్ర యూనిట్ సభ్యులు దసరా పండుగ కానుకగా ఈ సినిమా టైటిల్ సంబంధించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. తమిళ్ “అన్నాత్తే” .. వస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో పెద్దన్న .. గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిన్నటి రోజున తమిళ్ లో ఈ సినిమా టీజర్ కూడా విడుదలై భారీ రెస్పాన్స్ ను అందుకోగా ఇప్పుడు తెలుగు పోస్ట్ ని రిలీజ్ చేయడంతో.. రజనీకాంత్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళ తో పాటు తెలుగులో కూడా నవంబర్ 4వ తేదీన ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.