పుష్ప సినిమా ఐటమ్ గర్ల్ కు అన్ని కోట్లా..?

సినిమాలలో ఐటమ్ సాంగ్ లకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలంలో మరీ ఎక్కువగా అన్ని సినిమాలలో కూడా ఐటెం సాంగులను పెడుతున్నారు. సుకుమార్ లాంటి దర్శకుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క నాన్నకు ప్రేమతో సినిమా తో తప్ప ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో కూడా తప్పకుండా ఒక ఐటమ్ సాంగ్ పెడుతుండటం గమనార్హం. ఇక ఐటమ్ గర్ల్ ల కోసం వివిధ దేశాల నుంచి కూడా హీరోయిన్స్ ను తీసుకొచ్చి మరీ స్టెప్పులు వేయిస్తున్నారు. అంతే కాదు వీరికి అడిగినంత పారితోషికం కూడా పుచ్చుకుంటున్నారు నిర్మాతలు..

ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమా కోసం కూడా సుకుమార్ ఒక ఐటమ్ సాంగ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఆ పాట కోసం ఊర్వశి రౌటెలా వంటి భామలను అనుకున్నప్పటికీ చివరికి నోరా ఫతేహి ని ఫైనల్ చేశారట. కేవలం ఈ ఒక్క పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్లు తీసుకుంటోందని సమాచారం. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సినిమాకు ఒక స్టార్ హీరోయిన్ తీసుకునే రెమ్యునరేషన్ ఇది..

ఇక ‘టెంపర్’ సినిమాలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అనే సాంగ్ కు ఆమె కేవలం రూ.4 లక్షలు మాత్రమే తీసుకుంది. తర్వాత ‘బాహుబలి ది బిగినింగ్’ లో మనోహరి పాటకి రూ.6 లక్షలు తీసుకుంది. అయితే ఈ 5 ఏళ్ళలో ఆమె క్రేజ్ బాగా పెరిగింది. కానీ ఏకంగా రూ.2 కోట్ల స్థాయిలో పెరిగిందా అంటే.. షాకింగ్ అనే చెప్పాలి. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఐటమ్ గర్ల్ కూడా పారితోషకం అందుకుంటోంది అంటే అది అందరికీ షాకింగ్ గానే అనిపిస్తోంది.